‘2016లో నన్ను అసహ్యించుకున్నారు, ఇప్పుడేమో నక్క వినయాలు’.. మెటా, అమెజాన్ బాసులపై ట్రంప్ సెటైర్లు!
- ‘రెజీమ్ చేంజ్’ పుస్తకంలో ట్రంప్ ప్రైవేట్ సంభాషణల బహిర్గతం
- 2024 ఎన్నికల విజయం తర్వాత జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ ఎగతాళి చేసినట్లు వెల్లడి
- ట్రంప్ ప్రచార నినాదాన్ని జుకర్‌బర్గ్‌కు కుమార్తె లేఖ
- దానిని ఇతరులకు చూపిస్తూ ట్రంప్ వెక్కిరింపు
- అధికారంలోకి వచ్చాక ‘ఫస్ట్ క్లాస్ బతిమిలాట’గా మస్క్ ముందు అభివర్ణించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత, ప్రముఖ టెక్ బిలియనీర్లు మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ తనను ప్రసన్నం చేసుకోవడానికి పడిన తాపత్రయాన్ని ట్రంప్ ఎగతాళి చేసినట్లు ఒక కొత్త పుస్తకం ద్వారా వెల్లడైంది. జూన్ 23న విడుదల కాబోతున్న ‘రెజీమ్ చేంజ్: ఇన్సైడ్ ద ఇంపీరియల్ ప్రెసిడెన్సీ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్’ అనే పుస్తకంలో న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు మాగీ హేబర్మన్, జోనాథన్ స్వాన్ ఈ సంచలన విషయాలను పొందుపరిచారు. గతంలో (2016లో) తనను తీవ్రంగా వ్యతిరేకించిన సిలికాన్ వ్యాలీ అధిపతులు, ఇప్పుడు అధికారం మారగానే ‘అతి వినయం చూపుతూ బతిమిలాటలు’ (గ్రోవెలింగ్) మొదలుపెట్టారంటూ ట్రంప్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ఈ పుస్తకం స్పష్టం చేసింది.
ట్రంప్ నిర్వహించిన ప్రైవేట్ సమావేశాల్లో ఎలాన్ మస్క్ సహా ఇతర అతిథులకు జుకర్‌బర్గ్, బెజోస్ పంపిన చాటింగులను చూపిస్తూ హేళన చేసినట్లు రచయితలు పేర్కొన్నారు. ఒక సందర్భంలో మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తన చిన్న కూతురు రాసిన లేఖకు సంబంధించిన ఫోటోను ట్రంప్‌కు పంపారు. ఆ లేఖలో అమెరికాకు మళ్లీ ‘స్వర్ణయుగం’ రాబోతోందంటూ ట్రంప్ ప్రచార నినాదాన్ని ఆ చిన్నారి రాసుకొచ్చింది. అయితే ఈ మెసేజ్‌ను ట్రంప్ సీరియస్‌గా తీసుకోకుండా, 2016లో తనను అసహ్యించుకున్న వాళ్లే ఇప్పుడు ఇలాంటి ట్రిక్కులు ప్లే చేస్తున్నారంటూ తోటివారితో నవ్వుకుంటూ పంచుకున్నారు. ఈ అధికార మార్పిడి అనంతరం బిలియనీర్లు తన చుట్టూ తిరగడాన్ని ట్రంప్ వ్యక్తిగత విజయంగా ఆస్వాదించినట్లు పుస్తకంలో వివరించారు.
మరోవైపు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మార్-ఎ-లాగో రిసార్ట్‌లో జరిగిన ఒక డిన్నర్ లో ట్రంప్‌తో ప్రైవేట్‌గా మాట్లాడిన విషయాలు కూడా బయటకు వచ్చాయి. తన యాజమాన్యంలోని ప్రసిద్ధ పత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’ తన జీవితంలోనే అత్యంత దారుణమైన పెట్టుబడి అని, అందులో పనిచేసే జర్నలిస్టులు పనికిరాని వాళ్లంటూ బెజోస్ విమర్శించినట్లు రచయితలు తెలిపారు. ఆ తర్వాత బెజోస్ తన అంతరిక్ష సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ కోసం ట్రంప్ ప్రభుత్వం నుంచి కొన్ని వ్యాపార రాయితీలను కోరగా, ట్రంప్ మాత్రం మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పుస్తక సారాంశం అంతర్జాతీయంగా టెక్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారినప్పటికీ.. ట్రంప్, జుకర్‌బర్గ్ లేదా బెజోస్ కార్యాలయాలు దీనిపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.